హైదరాబాద్: భారతదేశంలో కిరాణా సామాగ్రుల (గ్రోసరీ) వ్యాపారానికి సారధ్యం వహించటానికి అమెజాన్ నడుం బిగించింది. దీనిపై అమెజాన్ ఫ్రెష్ డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీ రామ్ ఇచ్చిన ఇంటర్వ్యూను సంక్షిప్తంగా ఇస్తున్నాం.
ప్రశ్న: భారతదేశంలో అమెజాన్ గ్రోసరీ ప్రస్థానాన్ని వివరించగలరా?
శ్రీరామ్: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అమెజాన్ విభాగాల్లో గ్రోసరీ ఒకటి. దీనిలో మిలియన్ (పది లక్షల)కు పైగా ఉత్పత్తులు ఉన్నాయి, భారతదేశంలో 99.8 శాతం పిన్‌కోడ్‌ల పరిధిలో వీటిని డెలివర్ చేయటం జరుగుతోంది. గత 24 నెలల్లో, 50 శాతానికి పైగా అమెజాన్ ఫ్రెష్ కస్టమర్లు 2, 3వ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారు. 2022, ఎంతో ఉత్కంఠభరితమైన సంవత్సరం. ఎందుకంటే, 2022లో అమెజాన్ ఫ్రెష్‌లో పండ్లు, కూరగాయల విభాగంలో సేవలను చండీగఢ్, లుధియానా, ఒంగోలు, త్రివేండ్రమ్, కొచ్చి, హుబ్లీ, దుర్గాపూర్ వంటి 35కు పైగా మరెన్నో రెండవ, మూడవ శ్రేణి నగరాలకు విస్తరింపజేశాం. కస్టమర్ల అవసరాలను సావధానంగా వింటాం. ఎక్కువ కొనండి ఎక్కువ ఆదా చేసుకోండి వంటి సూపర్ సేవర్ ఆఫర్లను ప్రవేశపెట్టాం, తద్వారా వినియోగదారులకు వారి నిత్యావసరాలకుగాను సరిjైున విలువను అందించేందుకు కృషి చేశాం. భారత్‌లో మూలమూలలకు చేరుకోవాలని, ఫుల్ బాస్కెట్ సెలక్షన్‌ను వినియోగదారులకు అందించాలని కోరుకుంటున్నాం.
ప్రశ్న: నాణ్యత, సేవల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
శ్రీరామ్: మా కస్టమర్లకు విస్తృతశ్రేణి ఉత్పత్తులను అద్భుతమైన విలువకు, సౌకర్యంతోను, ఉత్తమమైన నాణ్యతతోనూ, సౌకర్యవంతమైన డెలివరీ స్లాట్లలో అందించేందుకు, తద్వారా వారికి అత్యుత్తమమైన ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం. నాణ్యత అనేది, సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంటుందని, సప్లై చెయిన్ ప్రక్రియలో ప్రతి దశలోనూ అది రైతులనుండి సేకరించటం కావచ్చు, నాణ్యతా తనిఖీల సమయంలో కలెక్షన్ సెంటర్ వద్ద కావచ్చు, లేదా కస్టమర్లకు ఉత్పత్తిని డెలివర్ చేసేటప్పుడు కావచ్చు – ఇది కీలకమైన పాత్రను పోషిస్తుందని మేం విశ్వసిస్తున్నాం. ఇటీవల లోకల్ సర్కిల్స్ వారు విడుదల చేసిన సర్వే స్పష్టంగా సూచిస్తోంది ఏమిటంటే, 50 శాతానికి పైగా వినియోగదారులు తమ ఆన్లైన్ గ్రోసరీ కొనుగోళ్ళను ముందుగా ప్లాన్ చేసుకుంటారు, తమ సౌకర్యాన్ని అనుసరించి డెలివరీ స్లాట్‌ను కలిగి ఉండటానికి వారు ప్రాధాన్యం ఇస్తారు. వేగంగా డెలివర్ చేయటంతో పోలిస్తే కస్టమర్లకు, సేవ, నాణ్యత, విలువలు ప్రధానం. ఈ ఫలితాలను పరిశీలిస్తే, మేము సరైన మార్గంలో ముందుకు సాగుతున్నామని, మా కస్టమర్లకు వారు కోరుకున్న టైమ్ స్లాట్లో షాపింగ్ చేసే సౌకర్యాన్ని ఆఫర్ చేస్తున్నాం.
ప్రశ్న: ఈ ఏడాది గ్రోసరీ వ్యాపారం కోసం అమెజాన్ ప్రణాళిక ఏమిటి?
శ్రీరామ్: తాజా పండ్లు, కూరగాయలు, ఫ్రోజెన్, చిల్డ్ ఉత్పత్తులు, సౌందర్యసాధనాలు, శిశు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు , పెంపుడు జంతువుల ఉత్పత్తులు, ఇతర దైనందిన గ్రోసరీ అవసరాల విస్తృత శ్రేణిని వారికి నిరంతరం అందించాలన్నది మా లక్ష్యం. మా వెట్ గ్రోసరీ సెలక్షన్ ఇప్పటికే 35కు పైగా నగరాల్లో అందుబాటులో ఉన్నది. మిగిలిన నగరాల విషయానికి వస్తే, భారతదేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు, డ్రై గ్రోసరీలైన ధాన్యాలు, వంటకు కావలసిన సామాగ్రులు, స్నాక్స్, పానీయాలు, ప్యాక్ చేసిన ఆహారసామాగ్రులు, గృహావసరాలు, ఇంకా మరెన్నో ఉత్పత్తులను, 1-3 రోజుల లోపు డెలివరీ పొందగలిగే విధంగా కొనుగోలు చేయగలుగుతారు. ఫ్రెష్‌ను భారతదేశవ్యాప్తంగా దశలవారీగా విస్తరింపజేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. దీంతో తాజా పండ్లు, కూరగాయలను, ఫ్రోజెన్, చిల్డ్ ఉత్పత్తులను సకాలంలో పంపించడం సాధ్యమవుతుంది.