Friday, February 3, 2023
Friday, February 3, 2023

కీర్తిలాల్‌ ఎక్స్‌క్లూజివ్‌ బ్రైడల్‌ కలెక్షన్‌ విడుదల

హైదరాబాద్‌ : నాణ్యత, నమ్మకమే పునాదులుగా తమ వినియోగదారులను ఆకట్టుకుంటున్న ప్రీమియం ఫైన్‌ డైమండ్‌, గోల్డ్‌ జ్యువెలరీ బ్రాండ్‌, కీర్తిలాల్స్‌ తమ ఎక్స్‌క్లూజివ్‌ బ్రైడల్‌ డైమండ్‌ జ్యువెలరీ కలెక్షన్‌ను హైదరాబాద్‌లోని తమ షోరూమ్‌లో విడుదల చేసింది. నటి సంచితా శెట్టి ఈ కలెక్షన్‌ ఆవిష్కరించడంతో పాటుగా ప్రదర్శించారు. ప్రత్యేక పండుగ ఆఫర్‌గా అన్ని వజ్రాభరణాలపై కేరట్‌కు 10వేల రూపాయల వరకూ తగ్గింపును అందిస్తున్నట్లు కీర్తిలాల్స్‌ ప్రకటించింది.
నవ వధువులకు అత్యంత ప్రాధాన్యతా బ్రైడల్‌ జ్యువెలరీ బ్రాండ్‌గా మాత్రమే కాదు. కాలాతీత సంప్రదాయ, సమకాలీన డిజైన్‌లతో వివాహ వేడుకలలో ప్రత్యేకంగా నిలిచే ఆభరణాలను రూపొందించడంలో కీర్తిలాల్స్‌ ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. వినూత్నమైన డిజైన్‌లతో ఈ బ్రైడల్‌ కలెక్షన్‌ను సున్నితంగా తీర్చిదిద్దారు. ఈ కలెక్షన్‌లో నెక్లెస్‌లు, హారాలు, గాజులు, చెవి రింగులు, వడ్డాణములలో ప్రత్యేకమైన డిజైన్‌లు ఉన్నాయి. వినియోగదారులు ఎంచుకునేందుకు వీలుగా విస్తృతశ్రేణిలో డిజైన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా 80 సంవత్సరాల కీర్తిలాల్స్‌ నాణ్యమైన వజ్రాలను వేడుక చేస్తూ కేరట్‌కు 10వేల రూపాయల తగ్గింపును పండుగ ఆఫర్‌గా అందిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img