Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

క్వాంటమ్‌ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ విడుదల

ముంబయి: క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఇప్పుడు క్వాంటమ్‌ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ను విడుదల చేసింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ పథకం. ప్రధానంగా నిఫ్టీ 50 ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెడుతుంది. వినూత్నమైన, భారతదేశపు మొట్టమొదటి నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ క్వాంటమ్‌ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌. ఈటీఎఫ్‌ సామర్థ్యంను ఇండెక్స్‌ ఫండ్‌ సౌకర్యంతో ఈ ఫండ్‌ మిళితం చేయడంతో పాటుగా మదుపరులకు ద్వంద్వ ప్రయోజనాలను అందిస్తుంది. భారతదేశపు నిఫ్టీ టాప్‌ 50లో డీమ్యాట్‌ ఖాతా తెరవకుండానే పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత సౌకర్యవంతమైన మార్గం క్వాంటమ్‌ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌. ఈ నూతన ఫండ్‌ ఆఫర్‌ జూలై 18, 2022న తెరుస్తారు, ఆగస్టు 01,2022న మూసి వేస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img