Monday, September 26, 2022
Monday, September 26, 2022

జీ నెట్‌వర్క్‌లో స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌ ప్రీమియర్‌

ముంబయి:ఎల్లప్పుడూ తన ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్న జీ నెట్‌వర్క్‌ ఇప్పుడు మరో థ్రిల్లింగ్‌ వారాంతపు బ్లాక్‌బస్టర్‌తో తిరిగి వచ్చింది. స్పైడీ అభిమానులందరికీ ‘విత్‌ గ్రేట్‌ పవర్‌, కమ్స్‌ గ్రేట్‌ రెస్పాన్సిబిలిటీ’ అనే గొప్ప మంత్రం వారి టెలివిజన్‌ స్క్రీన్‌లపై అత్యంత ప్రసిద్ధ స్పైడర్‌ మ్యాన్‌ చిత్రం- స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌ ప్రీమియర్‌తో ఆగస్టు 21న నిజం అవ్వబోతోంది. కొత్తగా విడుదలై, విస్తృతంగా ప్రజాదరణ పొందిన ఈ చలనచిత్రం ఎంతో ఆసక్తి రేపే మల్టీవర్స్‌ అనే కాన్సెప్ట్‌ని పరిచయం చేస్తూ, ముగ్గురు స్పైడీలతో వినోదాన్ని 3 రెట్లు పెంచుతుంది. టామ్‌ హాలండ్‌, ఆండ్రూ గార్ఫీల్డ్‌, టోబి మగ్వైర్‌ అన్ని తరాల ప్రేమను ఏకం చేసారు. ముగ్గురు పీటర్‌ పార్కర్లు ఏకమై చెడుతో పోరాడడాన్ని చూడవచ్చు. ఎలెక్ట్రో (జేమీ ఫాక్స్‌), గ్రీన్‌ గాబ్లిన్‌ (విలియం డఫో), డాక్టర్‌ ఆట్టో ఆక్టేవియస్‌ (ఆల్ఫ్రెడ్‌ మోలినా)వంటి విలన్‌లు ఉండే ఈ చిత్రం 2021లో అతిపెద్ద హిట్‌గా నిలిచి, బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img