Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

జులై 28న తెరువనున్న ఐడీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ

ముంబై: ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ తమ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఐడీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను విడుదల చేసినట్లు వెల్లడిరచింది. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఈక్విటీలు, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో గణనీయంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలపు మూలధన వృద్ధిని ఇది లక్ష్యంగా చేసుకుంది. ఈ మిడ్‌క్యాప్‌ విభాగం, భారీ క్యాప్స్‌తో పోల్చుకుంటే, మెరుగైన రీతిలో రిస్క్‌ సర్దుబాటు చేసిన రాబడిని అందిస్తుంది. అంతేకాదు, గత మూడేళ్లగా మిడ్‌క్యాప్‌ ప్రపంచంలో సరాసరి కంపెనీల పరిమాణం కూడా విస్తరించింది. దీర్ఘకాలంలో సంభావ్య మిడ్‌క్యాప్‌ కంపెనీల శక్తివంతమైన వృద్ధి సామర్ధ్యం నుంచి ప్రయోజనం పొందే వినూత్న అవకాశాన్ని మదుపరులకు ఐడీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ అందిస్తుంది. ఈ నూతనఫండ్‌ ఆఫర్‌ను గురువారం, జూలై 28, 2022న తెరుస్తారు. గురువారం, ఆగస్టు 11,2022వ తేదీన మూసి వేస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img