విశాలాంధ్ర/హైదరాబాద్: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యుఎస్) తాజాగా రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలంలోని నేద్నుర్ గ్రామంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో పునరుద్ధరణ పనులను చేపట్టడం ద్వారా తెలంగాణలోని స్థానిక సమాజాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడంపై దృష్టి కొనసాగిస్తున్నది, ఆరు నుండి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయస్సు గల 1100 మంది విద్యార్థులకు దీనివలన ప్రయోజనం చేకూరనున్నది. ఆధునిక వసతులతో పునర్నిర్మించిన నేద్నుర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్‌పిహెచ్‌ఎస్), తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ (టీఎస్‌ఎమ్‌ఎస్)లను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ (ఎస్‌టీఈఎఎమ్-స్టీమ్) విభాగాలపై ఆసక్తిని పెంపొందించేలా కేంద్రీకరించిన ఏడబ్ల్యుఎస్ థింక్ బిగ్‌స్పేస్‌ను కూడా ఈ కార్యక్రమంలో ప్రారంభించడం జరిగింది.