Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ పూర్తి

హైదరాబాద్‌ ః నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ (ఎన్‌ఐఎంఎఫ్‌)కు చెందిన ఎస్సెట్‌ మేనేజర్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఇండియా ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (నామ్‌ ఇండియా) విజయవంతంగా నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓను పూర్తిచేసింది. ఈ ఫండ్‌ మొత్తంమ్మీద 2860 కోట్ల రూపాయలను సమీకరించింది. తద్వారా ఇటీవలి కాలంలో అతిపెద్ద ఎన్‌ఎఫ్‌ఓగా నిలిచింది. భారతదేశ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అంటే దాదాపు 60%కు పైగా భారతీయ నగరాలను చేరుకున్న అత్యంత విజయవంతమైన ఎన్‌ఎఫ్‌ఓగా ఇది నిలిచింది. నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ అనేది ఓపెన్‌ ఎండెడ్‌ డైనమిక్‌ ఈక్విటీ స్కీమ్‌. భారీ, మధ్య, చిన్న తరహా క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img