Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

నైబర్‌హుడ్‌ ఫౌండేషన్‌ ‘ఫీడ్‌ బై ఆర్ట్‌’ పోటీలు

హైదరాబాద్‌ ః విద్య, ఆరోగ్యం, ఇతర సామాజిక అంశాల కోసం అంకితమైన ఎన్‌జీవో నైబర్‌హుడ్‌ ఫౌండేషన్‌ నేడు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల కోసం ‘ఫీడ్‌ బై ఆర్ట్‌’ శీర్షికన ఆర్ట్‌ పోటీలను నిర్వహించబోతున్నట్లు వెల్లడిరచింది. ఆకలి నుంచి ఉపశమనం కోసం తాము చేసే ప్రయత్నాలకు నిధుల సమీకరణలో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. వర్ట్యువల్‌గా నిర్వహించబోయే ఈ పోటీల కోసం రిజిస్ట్రేషన్‌లను చేసుకోవడంతో పాటుగా తమ ఆర్ట్స్‌ను సెప్టెంబర్‌ 25, 2021 లోపుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోటీలలో పాల్గొనేందుకు 100 రూపాయలు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నేరుగా ఫౌండేషన్‌ ఆకలి-ఉపశమన ప్రాజెక్ట్‌ ఫీడ్‌ ఎట్‌ 100కు చేరుతుంది. ఈ మొత్తంతో ఒకేసారి ముగ్గురు మనుషులతో పాటుగా రెండు జంతువులకు సైతం ఆహారం అందిస్తారు. రిజిస్ట్రేషన్లను ఫోన్‌/వాట్సాప్‌ (7200741106)లేదా ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img