Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

పర్యావరణహిత కలప నిర్మాణాలపై సెమినార్‌

హైదరాబాద్‌: కెనడా దేశంలోని బ్రిటిష్‌ కొలంబియా (బి.సి) ప్రావిన్షియల్‌ ప్రభుత్వానికి కీలకమైన ఏజెన్సీ కెనడియన్‌ వుడ్‌, ప్రధానమైన మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ మ్యాక్‌ ప్రాజెక్ట్స్‌ సహకారంతో, హైదరాబాద్‌లోని బీటీఆర్‌ గ్రీన్స్‌లో ‘బిల్డ్‌ విత్‌ వుడ్‌’ అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించింది. ఈ సెమినార్‌లో ఎన్‌ఎసి, డైరెక్టర్‌ జనరల్‌ బిక్షపతి, టిఐఇగ్లోబల్‌, వైస్‌ చైర్మన్‌, మురళి బుక్కపట్నం, టాస్క్‌ (టిఎఎస్‌కె), సిఇఒ, శ్రీకాంత్‌ సిన్హా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్‌- తెలంగాణ చాప్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, ఆర్కిటెక్ట్‌. శంకర్‌ నారాయణ్‌, కెనడా ప్రభుత్వం, ట్రేడ్‌ కమీషనర్‌, విక్రమ్‌ జైన్‌, నమీబియా, ట్రేడ్‌ కమీషనర్‌, డాక్టర్‌ తస్నీమ్‌, ఆదిత్య హోమ్స్‌, ఎమ్‌డి, కోట రెడ్డిలతో పాటు ప్రముఖ వాస్తుశిల్పులు, డెవలపర్లు, హెచ్‌ఎన్‌ఐలు, కలప నిర్మాణాలపై నైపుణ్యం కలిగిన పలువురు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img