హైదరాబాద్ : ఆసియాలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్, అపోలో హాస్పిటల్ గ్రూప్ తన హాస్పిటల్ నెట్‌వర్క్‌లో పేర్కొన్న సహ-అనారోగ్యాలు ఉన్న పిల్లలకు కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాడేందుకు ఉచిత వ్యాక్సినేషన్లను అందించనున్నట్లు ఈరోజు ప్రకటించింది. నిర్దిష్ట సహ-అనారోగ్యాలతో ఉన్న పిల్లలకు టీకాలు వేయడానికి త్వరలో ఆమోదం లభిస్తుందని, ఆమోదం పొందిన తర్వాత, టీకా కోసం అనుమతించబడిన వయస్సు-సమూహం వివరాలు అందిన తరువాత ఉచితంగా టీకా అందించే కార్యక్రమం ప్రారంభించాలని అపోలో హాస్పిటల్స్ భావిస్తున్నది. సహ-అనారోగ్యాల జాబితాలో హేమాటోలాజికల్, న్యూరోలాజికల్, కార్డియాక్, లివర్, గ్యాస్ట్రోఇంటెస్టినల్, రుమాటిక్, క్యాన్సర్, రెస్పిరేటరీ, జెనిటూరినరీ, డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉన్న పిల్లలు ఉంటారని భావిస్తున్నారు.