Friday, March 24, 2023
Friday, March 24, 2023

బజాజ్‌ అలయన్జ్‌ ‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌’విడుదల


పూణె: భారతదేశంలో అగ్రగామి ప్రైవేట్‌ జనరల్‌ భీమా సంస్థలలో ఒకటైన బజాజ్‌ అలయన్జ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పుడు మాడ్యులర్‌ ఆరోగ్య భీమా ఉత్పత్తి ‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌’ను విడుదల చేసింది. ‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌’ను అంబ్రెల్లా ప్రొడక్ట్‌గా దరఖాస్తు చేశారు. దీనిలో భాగంగా అనుకూలీకరించిన ప్యాకేజీలను అందిస్తున్నారు. వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా కవరేజీని ఎంచుకునే సౌలభ్యం దీనిలో ఉంది. ఈ కారణం చేత తమ సొంత ఆరోగ్య సంరక్షణ ప్లాన్‌ను డిజైన్‌ చేసుకునే స్వేచ్ఛ కూడా ఉంది. దీనిని అనుసరించి వారు తమ పాలసీకి ప్రీమియం సైతం కనుగొనవచ్చు. ఈ కంపెనీ ఇప్పుడు ప్లాన్‌ 1ను అంబ్రెల్లా ప్రొడక్ట్‌ కింద విడుదల చేసింది. దీనిలో తప్పనిసరి, ఆప్షనల్‌ కవరేజీలు కూడా భాగంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img