Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

బాదములతో రక్షాబంధన్‌ వేడుక

హైదరాబాద్‌ ః దేశవ్యాప్తంగా కుటుంబాలన్నీ కూడా రక్షాబంధన్‌ వేడుకల కోసం సిద్ధమవుతున్నాయి. ఈసారి సోదరసోదరీమణుల మధ్య బహుమతుల ఎంపికను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య, ఆహార నిపుణులు అంటున్నారు. బాదములు లాంటి బహుమతులు ఇచ్చుకోవడం వల్ల ఆ బహుమతి అందుకున్న వారి ఆరోగ్యమూ మెరుగుపరుస్తాయి. బాదములలో పోషకాలైనటువంటి విటమిన్‌ ఈ, మెగ్నీషియం, ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌, జింక్‌ మొదలైనవి ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవితానికి ఇవన్నీ అవసరం తరచుగా బాదములు తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటుగా మధుమేహం, బరువు నిర్వహణ, చర్మ ఆరోగ్యం మెరుగుపడటం జరుగుతుంది. సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహాఅలీఖాన్‌, న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి వంటి ప్రముఖులు బాదాములకు అభిమానులుగా వున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img