ఒక్క రోజే రు. 1310 పెరుగుదల
న్యూదిల్లీ: బంగారం ప్రియులకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. పసిడిపై బేసిక్ దిగుమతి సుంకం 15 శాతానికి పెంచుతున్నట్లు కేంద్రం ఓ నోటిఫికేషన్లో తెలిపింది. గురువారం నుంచే పెరిగిన ధర అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే రూ.1310 పెరిగి రూ.52,200 వద్ద స్థిర పడిరది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధరలు స్వలంగా తగ్గుముఖం పట్టాయి. క్రితం ట్రేడిరగ్తో పోలిస్తే ఈ రోజు ట్రేడిరగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1794 డాలర్లు, ఔన్స్ వెండి ధర 19.76 డాలర్లుగా నిలిచింది. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు, ఇతర వినిమయ వస్తువుల ధరల ప్రభావంతో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ ఈ వారం ఆల్‌టైం కనిష్ఠ స్థాయి రూ.79లకు పడి, తిరిగి పుంజుకున్నది. దీంతో ఎగుమతుల కంటే దిగుమతుల విలువ ఎక్కువైంది. ఫలితంగా కరంట్ ఖాతా లోటు పెరిగింది.
క్యాడ్ ప్రభావాన్ని తగ్గించేందుకు, బంగారం దిగుమతిని నిరుత్సాహ పరిచేందుకు దానిపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచివేసింది. భారత్‌లో బంగారం వినియోగదారులు పూర్తిగా దిగుమతిపైనే ఆధార పడి ఉంటారు.మే నెల వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 24.3 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో కేంద్రం వివిధ దిగుమతులపై తీవ్రంగా దృష్టి సారించింది. ప్రత్యేకించి బంగారం దిగుమతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది. కరంట్ ఖాతా లోటు (క్యాడ్) పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నది. గతేడాదితో పోలిస్తే మే నెలలో బంగారం దిగుమతులు తొమ్మిది రెట్లు పెరిగి 7.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.