Friday, August 12, 2022
Friday, August 12, 2022

మెటావర్స్‌లో అజ్నాలెన్స్‌ ఉపాధి అవకాశాలు

ముంబయి: మెటావర్స్‌లో అంతర్జాతీయంగా వేలాది ఉద్యోగావకాశాలు స్వాగతం పలుకుతున్నా యి. వివిధ నివేదికల ప్రకారం, భారతదేశంలోనే ఇప్పుడు 55,000 ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నా, పరిశ్రమ అవసరాలకు, నిపుణులైన సిబ్బందికి మధ్య భారీగా అంతరం ఉంది. ఈ నేపథ్యంలో ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఎక్స్‌ఆర్‌ హార్డ్‌ వేర్‌, సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ అజ్నాలెన్స్‌ ఈ అంతరాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేపట్టింది. అందులో భాగంగా, మెటావర్స్‌ ఎడ్యుకేషన్‌లో, ఎంప్లాయిమెంట్‌ విభాగంలో అగ్రగామిగా ఉండేలా, తన ఫ్లాగ్‌షిప్‌ ఆఫరింగ్‌ అజ్నా క్రియేటర్స్‌ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. భారతదేశపు మొట్టమొదటి సర్టిఫైడ్‌ మెటావర్స్‌ క్రియేషన్‌ ప్రోగ్రామ్‌గా ఇది ఎక్స్‌ఆర్‌, డిజిటల్‌ ట్విన్‌, బ్లాక్‌ చెయిన్‌, ఇంకా మరెన్నో అంశాలకు సంబంధించి మెటావర్స్‌ కీలక అంశాలపై సమగ్ర అభ్యసనాన్ని అందించనుంది. ఈ ప్రోగ్రామ్‌ ప్రపంచవ్యాప్తంగా మెటావర్స్‌లో అత్యధిక జీతాలు (ఏటా రూ.100,000-రూ.130,000 శ్రేణిలో) పొందే అవకాశాలకు భారతీయు యువతను సన్నద్ధం చేయనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img