ముంబయి: రిలయన్స్ అంటేనే భారతదేశం నెంబర్ వన్ బ్రాండ్. నమ్మకానికి ప్రతీరూపం రిలయన్స్. అలాంటి బ్రాండ్ నుంచి వస్తున్న ఉత్పత్తులు అంటే ఆటోమేటిగ్గా ప్రతీ ఒక్కరికీ ఆసక్తిగా ఉంటాయి. అలాంటి రిలయన్స్ రిటైల్ ఇప్పుడు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆగస్టు 23, 2024 నుంచి ఆగస్టు 25, 2024 వరకు అంటే రెండు రోజుల పాటు ది వెడ్డింగ్ కలెక్టివ్ పేరుతో అద్బుతమైన ఈవెంట్‌ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా ప్రత్యేకమైన, ఖచ్చితమైన వెడ్డింగ్ కలెక్షన్‌ను ప్రదర్శనకు పెడుతున్నట్లు ప్రకటించింది. వధూవరులు, వారి కుటుంబాలకు అద్భుతమైన వివాహ ప్రణాళిక అనుభవాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ ఈవెంట్ ద్వారా వివిధ వర్గాల నిపుణులందరినీ ఒకే కప్పు క్రిందకు తీసుకురావడం ద్వారా వివాహ షాపింగ్ అనుభవాన్ని పునర్నిర్వచించటానికి రూపొందింది. ఫ్యాషన్ నుండి గౌర్మెట్ వంటకాల వరకు, ఆభరణాల నుండి వెడ్డింగ్ ప్లానర్‌ల వరకు, లగ్జరీ బ్యూటీ సర్వీస్‌లు బెస్పోక్ ఫైనాన్షియల్ గైడెన్స్ వరకు, ప్రీమియం సేవల శ్రేణిని ఇక్కడ ఆస్వాదించవచ్చు.