ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో భాగంగా పని చేస్తున్న అత్యంత వేగంగా దిగ్గజ పెన్షన్ ఫండ్ మేనేజర్. మే 15, 2023 నాటికి తన ఆధ్వర్యంలో అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) నిధుల విషయంలో రూ. 50,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. 2023లో ప్రారంభించినప్పటి నుంచి, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి పూర్తి సబ్సిడరీ అని కంపెనీ, అత్యంత వేగంతో అభివృద్ధి సాధించింది (కింది టేబుల్ చూడండి.) 33 నెలల కాలంలో ఏయూఎం పరిమాణం 400 శాతం పెరిగి, జూలై 2020లో సాధించి రూ. 10,000 కోట్ల నుంచి భారీగా వృద్ధి సాధించింది. హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ అనేది ఇండియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దిగ్గజ పెన్షన్ మేనేజర్, ఇది రిటైల్, కార్పొరేట్ ఎన్‌పీఎస్ విభాగాలలో, అత్యధిక సబ్‌స్క్రైబర్స్ సంఖ్య 1 మే 2023 నాటికి 15,00,000G కలిగి ఉందని హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీరామ్ అయ్యర్ తెలిపారు. కాగా, మనీ టుడే ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్‌కి 2019 నుంచి 2022 వరుసగా 3 సంవత్సరాల పాటు ‘బెస్ట్ పెర్ఫామింగ్ పీఎఫ్‌ఎం’ అవార్డ్ అందుకుంది.