విశాలాంధ్ర/హైదరాబాద్: ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్‌లోని గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్ (జీజీహెచ్) వారి మైలురాళ్లకు మరో రెక్కను జోడిరచింది, ఇది 900పైగా కాలేయ మార్పిడి మార్కును దాటడం ద్వారా హైదరాబాద్‌లో మొదటి సింగిల్ ఇన్స్టిట్యూట్గా అవతరించింది. తెలుగు రాష్ట్రాల్లో 900 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జీజీహెచ్ వైరల్ హెపటైటిస్, దాని ప్రభావాలు, తక్షణ చర్యపై సామూహిక అవగాహన ప్రచారాన్ని ‘‘హెపటైటిస్ సంరక్షణను మీకు చేరువ చేయడం’’ ప్రారంభించింది. ముఖ్యఅతిథులు తెలంగాణ రాష్ట్ర హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖ మహమ్మద్ మహమూద్ అలీ, విశిష్ట అతిథి నటుడు రాజేంద్ర ప్రసాద్, గౌరవ అతిథి ఐఐహెచ్ హెల్త్‌కేర్ ఇండియా సీఈఓ అనురాగ్ యాదవ్, బృందం సమక్షంలో ఈ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు.