Monday, December 5, 2022
Monday, December 5, 2022

వ్యాక్సిన్‌పై అపోలో హాస్పిటల్స్‌ ఆఫర్‌

హైదరాబాద్‌ : భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించాలని అపోలో హాస్పిటల్స్‌ ప్రతిజ్ఞ పూనింది. కోవాగ్జిన్‌ టీకా కోసం స్పెషల్‌ ఫ్రీడమ్‌ ఆఫర్‌తో టీకా డ్రైవ్‌ను చేపట్టింది. ప్రైవేట్‌ ఆసుపత్రుల కోసం ప్రభుత్వం రూ .1,410/- (జిఎస్‌టి మరియు సర్వీస్‌ ఛార్జీతో సహా) గరిష్ట ధరగా నిర్ణయించిన కోవాగ్జిన్‌ టీకాను స్పెషల్‌ ఫ్రీడం కింద అపోలో హాస్పిటల్స్‌ ఎలాంటి అదనపు సేవా రుసుం, లాభాపేక్ష లేకుండా కేవలం రూ .1,250/- ధరకే అందిస్తున్నది. కోవాగ్జిన్‌ కోసం ఫ్రీడమ్‌ ఆఫర్‌ 2021 ఆగస్టు 12 నుండి 21వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ ఆఫర్‌ మొదటి, రెండవ డోస్‌ రెండిరటికీ కూడా చెల్లుబాటు అవుతుంది. అదే మొదటి డోస్‌ విషయం అయినట్లయితే, తదుపరి డోస్‌ను కూడా అదే రేటు హామీతో అందించబడుతుంది. అపోలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఈ సమయంలో మరియు కోవిడ్‌ టీకాపై ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తుంది. 18 ఏళ్లు పైబడిన వ్యక్తులు 2021 ఆగస్టు 12 నుండి 21 వరకు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య తమకు సమీపంలోని అపోలో టీకా కేంద్రాన్ని సందర్శించవచ్చునని అపోలో హాస్పిటల్స్‌, రీజినల్‌ సిఇఒ, వై సుబ్రమణ్యం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img