గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద కస్టమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్ తన అతిపెద్ద ఫెస్టివ్ సేల్ ‘ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్’ని ప్రకటించింది. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, టా బ్లెట్స్, ల్యాప్‌టాప్‌లు, ఉపకరణాలు, ధరించగలిగిన వస్తువులు, స్మార్ట్ టీవీలు, డిజిటల్ ఉపకరణాలు, స్మార్ట్ మానిటర్లు వంటి వాటిపై అద్భుతమైన డీల్స్, క్యాష్‌బ్యాక్‌ను అందజేస్తోంది. మునుపెన్నడూ లేని ఈ ఆఫర్లు సామ్‌సంగ్.కామ్, సామ్‌సంగ్ షాప్ యాప్, సామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు అదనంగా 5% వరకు తగ్గింపును పొందవచ్చు. సామ్‌సంగ్.కామ్ లేదా సామ్‌సంగ్ షాప్ యాప్ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లు, ధరించగలిగేవి, స్మార్ట్ టీవీలు, డిజిటల్ ఉపకరణాలపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6ని కొనుగోలు చేసే వినియోగదారులు వర్తించే అన్ని ఇతర ఆఫర్‌లతో పాటుగా కేవలం రూ.1249కు గెలాక్సీ బడ్స్ ఎఫ్‌ఈని పొందవచ్చు. అదేవిధంగా గెలాక్సీ బుక్ 4ని కొనుగోలు చేసే వారు కేవలం రూ.1920లకు ఎఫ్ హెచ్‌డి ఫ్లాట్ మానిటర్‌ను పొందవచ్చు.