సికింద్రాబాద్ : ఎలాంటి ఇంటికైనా అందాన్ని ఇచ్చేది ఫ్లోర్. ఇప్పుడు అందరూ ఫ్లోర్ కోసం టైల్స్ వాడుతున్నారు. అలాంటి టైల్స్ రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది ఓరియంట్ బెల్ టైల్స్. ఇప్పటికే మోస్ట్ ప్రొఫెషనల్ బ్రాండ్‌గా భారతదేశంలో గుర్తింపు తెచ్చుకున్న ఓరియంట్ బెల్ టైల్స్ తాజాగా తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. అందులో భాగంగా తెలంగాణ సికింద్రాబాద్‌లో సరికొత్త ఓబీటీబీ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ ఓరియంట్ బెల్ టైల్స్ బొటిక్ (ఓబీటీబీ) స్టోర్‌ను సికింద్రాబాద్‌లోని మహాలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌లో ఏర్పాటు చేసింది. దీనిద్వారా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి సరికొత్త మోడల్స్, డిజైన్ టైల్స్‌ను చూసేందుకు, కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.