Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

సోనాలికా ఈ-గురుకుల్‌ ప్రారంభం

హైదరాబాద్‌ ః అసాధారణ ప్రదర్శనను 2022 ఆర్ధిక సంవత్సర మొదటి త్రైమాసంలో నమోదుచేసిన తరువాత, సోనాలికా ట్రాక్టర్స్‌ మరింతగా తమ వృద్ధిని కొనసాగిస్తూ శక్తివంతమైన ప్రదర్శనను జూలై నెలలో కూడా చేయడంతో పాటుగా రికార్డు స్థాయిలో 10,756 ట్రాక్టర్లను విక్రయించింది. తద్వారా 5.2% వృద్ధిని నమోదు చేసింది. సోనాలికా రైతుల వేసిన పంటలకు తగిన అవసరాలను తీర్చే రీతిలో తమ ఉత్పత్తులను రూపొందిస్తుంటుంది. ఇందులో భాగంగానే తయారీ కేంద్రాల వద్ద కస్టమైజ్డ్‌ ట్రాక్టర్స్‌, ఇంప్లిమెంట్స్‌ను అభివృద్ధి చేస్తున్నది. సోనాలికా ఇటీవలనే ఇంటరాక్టివ్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ సోనాలికా ఈ-గురుకుల్‌ను ప్రారంభించింది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్‌ ఆధారిత ఛానెల్‌ ‘సోనాలికా-ఈ-గురుకుల్‌’ గ్రామీణ ప్రాంతాలలోని చిన్నారుల విజ్ఞానాన్ని గణనీయంగా వృద్ధి చేయనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img