Friday, December 1, 2023
Friday, December 1, 2023

సోనీ సరికొత్త వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్‌లు విడుదల

న్యూఢల్లీి: సోనీ ఇండియా తాజాగా డాల్బీ అట్మాస్‌ అనుభవంతో – అత్యంత తేలికైన వైర్‌లెస్‌ ఇన్‌-ఇయర్‌ హెడ్‌ఫోన్‌ సోనీ`డబ్ల్యుఐ సీ100ను ప్రవేశపెట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్‌-ఇయర్‌ హెడ్‌ఫోన్‌లు ఎటువంటి లోపంలేని, వైర్‌లెస్‌ వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి తయారయ్యాయి. సోనీ దాని అభివృద్ధి ప్రక్రియ ప్రధాన భాగంలో చేర్చిన అంశాలు. తేలికగా ఉన్న, కాంపాక్ట్‌ డబ్ల్యుఐ-సీ100 వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్‌లు, అద్భుతమైన సౌండ్‌ కస్టమైజేషన్‌, ఉపయోగ సౌలభ్యం, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌, స్ప్లాష్‌ ప్రూఫ్‌ డిజైన్‌తో అధిక నాణ్యత కలిగిన ధ్వనిని మిళితం చేస్తాయి. సోనీ సరికొత్త వైర్‌లెస్‌ ఇన్‌-ఇయర్‌ హెడ్‌ఫోన్‌లు గొప్ప ఫీచర్లను అందిస్తాయి. ప్రయాణంలో సంగీతాన్ని ఆస్వాదించాలని చూస్తున్న హై-ఫై సంగీత ప్రియులకు ఇవి అనువైనవి. త్వరిత చార్జుతో కాల్స్‌ మరియు అంతరాయం లేని మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ కోసం 25 గంటల వరకుఎక్కువకాలం నడిచే బ్యాటరీ లైఫ్‌ దీని ప్రత్యేకత.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img