Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

హెచ్‌యూఎల్‌ ప్యూర్‌ఇట్‌ కొత్త శ్రేణి వాటర్‌ ప్యూరిఫైయర్లు విడుదల

ముంబై: హెచ్‌యూఎల్‌కు చెందిన ప్యూర్‌ఇట్‌ తన కొత్త శ్రేణిని ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్యూర్‌ఇట్‌ వైటల్‌ సిరీస్‌ ఫిల్‌ట్రా పవర్‌ టెక్నాలజీతో కూడిన కొత్త శ్రేణి ఆర్‌ఓGయూవీG మినరల్స్‌ ఆధారిత వాటర్‌ ప్యూరిఫైయర్‌లు, పారిశ్రామిక రసాయనాలు, పురుగుమందులు వంటి విషపదార్థాలను వ్యాధికారకాలను తొలగిస్తాయని, సురక్షితమైన త్రాగునీటిని అందిస్తాయని నిరూపితమైంది. ఇది కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. అంతర్జాతీయ ప్రయోగశాలలచే పరీక్షించబడుతుంది. ఈ శ్రేణి, నీటి రికవరీ, శుద్దీకరణ వేగంలో అత్యుత్తమ పనితీరుతో టర్బోచార్జ్‌ చేయబడిరది. దాని మినరల్‌ ఎసెన్స్‌ టెక్నాలజీ కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన మినరల్స్‌తో నీటిని సుసంపన్నం చేస్తుంది. ఈ పరికరం అనేక సౌకర్యవంతమైన, లగ్జరీ ఫీచర్లని కలిగి ఉందని హిందూస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ హోమ్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దీపక్‌ సుబ్రమణియన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img