హైదరాబాద్ : కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ, హైదరాబాద్‌లో వ్యూహాత్మకంగా ఏఎస్ రావు నగర్, సికింద్రాబాద్, సోమాజిగూడలో తమ 3వ, 4వ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లను వైభవంగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా కిస్నా కు ఇవి 37వ, 38వ షోరూమ్‌లను సూచిస్తాయి. ఈ ప్రారంభోత్సవంలో హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎండి ఘనశ్యామ్ ధోలాకియా, కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ డైరెక్టర్ పరాగ్ షా పాల్గొన్నారు. ఈ వైభవోపేత ప్రారంభోత్సవం పురస్కరించుకుని, కిస్నా తమ విలువైన కస్టమర్లకు వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 100% వరకు తగ్గింపు, బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 20% వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌లకు ఉత్సాహాన్ని జోడిస్తూ, కిస్నా అద్భుతమైన లక్కీ డ్రా ప్రచారాన్ని అబ్కీ బార్ ఆప్ కే లియే షాప్ అండ్ విన్ ఏ కార్ పేరిట ప్రారంభించింది, ఈ ఆఫర్‌తో 100కిపైగా కార్లు గెలుచుకునే అవకాశం అందిస్తుంది.