Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

అభివృద్ధిపథంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ అభివృద్ధిపథంలో నడుస్తున్నదని సంస్థ ఎండీ, సీఈవో విభా పదాల్కర్‌ తెలిపారు. ఎక్సైడ్‌ లైఫ్‌ అక్టోబర్‌ 14న ఐఆర్‌డీఏఐ నుండి తుది ఆమోదం పొందిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌తో విలీనమయింది. మొత్తం లావాదేవీ సెప్టెంబరు 2021లో డీల్‌ ప్రకటించినప్పటి నుండి జనవరి 2022లో కొనుగోలు, చివరికి విలీనం 14 నెలల్లోపు పూర్తయింది. తమ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐ, ఎం అండ్‌ ఏలో పాలుపంచుకున్న ఇతర అధికారులకు ఆమె అభినందనలు తెలిపారు. అలాగే, సమయానుకూలమైన ఆమోదం పట్ల ధన్యవాదాలు తెలిపారు. వ్యాపార పరంగా, తాము స్థిరమైన వృద్ధి పథాన్ని కొనసాగించినట్లు తెలిపారు. హెచ్‌1 2023లో మొత్తం ఏపీఈ పరంగా 11% వృద్ధిని సాధించామని, అంటే ఎక్సైడ్‌ లైఫ్‌ను మినహాయించి ఈ త్రైమాసికంలో పరిశ్రమకు అనుగుణంగా, లిస్టెడ్‌ పీర్‌ల కంటే వేగంగా వృద్ధి చెందామన్నారు. దీని వలన మార్కెట్‌ వాటా 14.6% నుండి క్యూ2లో 15.0%కి ప్రీ-మెర్జర్‌ ప్రాతిపదికన మెరుగుపడిరదన్నారు. సమూహ వ్యాపారాలలో మొదటి మూడు జీవిత బీమా సంస్థగా తమ మార్కెట్‌ నాయకత్వ స్థానాన్ని కొనసాగించామని, డబ్ల్యుఆర్‌పీ పరంగా మార్కెట్‌ వాటా అంటే ఎక్సైడ్‌ లైఫ్‌తో సహా ప్రైవేట్‌ ప్లేయర్‌లలో 16.1%, మొత్తం పరిశ్రమలో 10.2% వుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img