Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌ 100% స్కాలర్‌షిప్‌

వరంగల్‌ : డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలుగంటున్న 10`12 తరగతి విద్యార్థులు నీట్‌, ఐఐటీ-జెఈఈ కోచింగ్‌ పొందేందుకు పరీక్ష సన్నద్ధత సేవల్లో జాతీయస్థాయి సంస్థ ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఎఈఎస్‌ఎల్‌) ప్రతిష్ఠాత్మక వార్షిక స్కాలర్‌షిప్‌ పరీక్ష ఆకాశ్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ ఎగ్జామ్‌ (ఎఎన్‌టీహెచ్‌ఈ) 2021, పన్నెండవ ఎడిషన్‌ ద్వారా 100% వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. ఎఎన్‌టీహెచ్‌ఈ 2021 పరీక్ష ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లో డిసెంబర్‌ 4-12, 2021 మధ్య దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతుంది. ట్యూషన్‌ ఫీజుపై స్కాలర్‌షిప్‌తో పాటు అత్యుత్తమ స్కోర్‌ చేసిన వారికి నగదు బహుమతులు కూడా ప్రదానం చేయనున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే వివిధ గ్రేడుల్లో అత్యున్నతంగా నిలిచే ఐదుగురు విద్యార్థులు తమ తల్లిదండ్రుల్లో ఒకరితో కలిసి ఉచితంగా నాసా సందర్శించవచ్చు. ఎఎన్‌టీహెచ్‌ఈలో అర్హత సాధించే విద్యార్థులు అదనంగా మెరిట్‌ నేషన్‌ స్కూల్‌ బూస్టర్‌ కోర్సు ఉచితంగా పొందవచ్చు. మెరిట్‌ నేషన్‌ ఎఈఎస్‌ఎల్‌ అనుబంధ సంస్థ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img