Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ను ఏర్పాటుచేసిన ఒప్పో

విజయవాడ: కెమెరా ఆవిష్కరణలో అగ్రగామిగా ఉన్న ఒప్పో తన కెమెరా ఆవిష్కరణల ప్రయోగశాలను హైదరాబాద్‌ ఆర్‌ అండ్‌ డి సెంటర్‌ లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. స్థానిక అవసరాలకు అనుగుణమైన ఫీచర్లు, కృత్రిమ మేధస్సు ఉపయోగించి కెమెరా పరిష్కరణలతో మెరుగైన వినియోగదారుని అనుభవం కోసం ఇమేజింగ్‌ సాఫ్ట్‌ వేర్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించేందుకు అనువుగా ఈ ల్యాబ్‌ ను డిజైన్‌ చేశారు. ఒప్పో తన వినియోగదారులకు హై-ఎండ్‌ వీడియోగ్రఫీ ఆవిష్కరణలను అందించే దిశలో తన కెమెరాల్లో కృత్రిమ మేధస్సు సామర్ధ్యాలను పెంచాలని నిర్ణయించిందని ఒప్పో ఇండియా ఆర్‌ అండ్‌ డి ఉపాధ్యక్షుడు, హెడ్‌ తస్లీమ్‌ ఆరిఫ్‌ తెలిపారు. వీడియో, స్టిల్‌ ఫోటోగ్రఫీ, ఫుల్‌ డైమెన్షన్‌ ఫ్యూజన్‌ పోర్టెయిట్‌ వీడియో సిస్టమ్‌ టెక్నాలజీపై పరిశోధన, పరిష్కరణలకు అభివృద్ధి చేసే దిశలో ఈ ప్రయోగశాల పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img