Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇ-వేస్ట్‌ రీసైక్లింగ్‌లో ఎంటీసీ ఎగ్జిగో జేవీ సంచలనం


హైదరాబాద్‌ : భారతదేశ అతిపెద్ద మెటల్‌ స్క్రాప్‌ ప్రాసెసర్స్‌ ఎంటీసీ గ్రూప్‌, అగ్రగామి ఇ-వేస్ట్‌ రీస్లైకర్‌ ఎగ్జిగో రీసైక్లింగ్‌ కలసి ఎంటీసీ-ఎగ్జిగో రీసైక్లింగ్‌ ప్రై.లి. (ఎంఈఆర్పీఎల్‌) జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేశాయి. ముంబై ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ బెంగళూరు, చెన్నైలలో 2022 మార్చి నాటికి తన ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ ఏటా 2 లక్షల టన్నుల ఇ-వేస్ట్‌ ను ప్రాసెస్‌ చేయనుంది. అంతేగాకుండా దశల వారీగా రీసైక్లింగ్‌ సామర్థ్యాన్ని పెంచనుంది. అంతేగాకుండా ఎన్సీఆర్‌, హై దరాబాద్‌, అహ్మదాబాద్‌, కోల్‌కతా, లక్నోలతో సహా పది నగరాలకు తన ఉనికిని విస్తరించుకోనుంది. ఒక్కో ప్లాంట్‌లో 1000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించడం ఎంఈఆర్పీఎల్‌ లక్ష్యం. భారత దేశంలో ఇ-వేస్ట్‌ ఆధారిత ఆర్థికవ్యవస్థకు ఊతం అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అధికం చేయడం దీని లక్ష్యమని ఎంటీసీ గ్రూప్‌ ఎండీ సంజయ్‌ మెహతా అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img