ముంబయి: అమెజాన్ తన ‘ఐ హావ్ స్పేస్’ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని వేలాది మంది భాగస్వాములతో కలిసి పనిచేస్తుండగా, ఇది హైదరాబాద్‌కు చెందిన భాగ్యరాజు వంటి వ్యక్తులకు అదనపు ఆదాయాన్ని సంపాదించేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఈ పండుగ సీజన్లో అమెజాన్ తెలంగాణ అంతటా తన డెలివరీ నెట్‌వర్క్‌ను వృద్ధితో పాటు విస్తరించుకుంటోంది. ‘ఐ హ్యావ్ స్పేస్ ప్రోగ్రాం ద్వారా ఇది ప్రతి ఒక్కరూ తమ ఎంటర్‌ప్యూనర్ సామర్థ్యాలను తెలుసుకుని, వినియోగించుకునేందుకు, లాస్ట్-మైల్ డెలివరీ ప్రోగ్రామ్‌లతో తమ పరిధిని విస్తరించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అమెజాన్ ఇండియా స్థానిక స్టోర్లు, వ్యాపార యజమానులతో భాగస్వాములై తమ స్టోర్‌కు 2 నుంచి 4 కి.మీ. పరిధిలోని వినియోగదారులకు ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు, తమ ఆదాయానికి, అదనంగా సంపాదించుకునే అవకాశాన్ని సృష్టిస్తోంది. ఈ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించగా, ఇందులో తెలంగాణలోని వేలాది ‘ఐ హావ్ స్పేస్’ స్టోర్లతో పాటు భారతదేశంలోని తన నెట్‌వర్క్‌లోని సుమారు 420 పట్టణాలు, నగరాల్లో 28,000 కన్నా ఎక్కువ పొరుగు, కిరాణా భాగస్వాములను కలిగి ఉంది.