Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఓఎల్‌ఎక్స్‌ ఆటోలో.. 1 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల వ్యాపారం

న్యూదిల్లీ : సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల అమ్మకాల ప్లాట్‌ఫామ్‌ ఓఎల్‌ఎక్స్‌ ద్వారా ఆసియా, అమెరికాలోని పది దేశాలలో చేపట్టిన క్రయవిక్రయాలు రూ.1 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు దాటినట్టు ఆ సంస్థ వెల్లడిరచింది. భారతీయ కరెన్సీలో ఆ విలువ రూ. 7,420 కోట్లకు పైనే ఉంటుందని సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలిపింది. 2020 జనవరిలో ప్రారంభించిన ఈ ప్లాట్‌పామ్‌లో ప్రతినెలా వేల వాహనాలు అమ్మకాల కోసం ప్రకటనలు తమ క్లాసిఫైడ్‌లో నమోదయ్యాయని పేర్కొంది. దాదాపు 5 లక్షల కార్లు ఇండియా, ఇండోనేషియా, లాటిన్‌ అమెరికా దేశాల్లో విక్రయించబడ్డాయని తెలిపింది. వ్యాపారం ప్రారంభమైన నాటి నుంచి విశ్వసనీయతతో చేపట్టిన వాహనాల అమ్మకాలతో మొత్తం లావాదేవీలు 1 బిలియన్‌ యూఎస్‌ డాలర్లను మించిపోయిందని ఆ సంస్థ ప్రతినిధి గౌతమ్‌ థాకర్‌ వెల్లడిరచారు. కోవిడ్‌`19 సమయంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదురైనా వినియోగదారులకు కొన్ని సేవలను అందించినట్టు తెలిపారు. ఉత్తమమైన డేటా, టెక్నాలజీతో క్రయవిక్రయాలు సాగించే ఓఎల్‌ఎక్స్‌ ఆటో సేవలు 2020 జనవరిలో ఫ్రాంటియర్‌ కార్‌ గ్రూప్‌ ద్వారా ప్రారంభించబడినట్టు చెప్పారు. ఆసియా, అమెరికా ఖండాలలో 450కి పైగా తనిఖీ కేంద్రాలను నిర్వహిస్తున్నామని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img