Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఓలా ఎలక్ట్రిక్‌ ఓలా ఎస్‌1 ఎయిర్‌ విడుదల

ముంబయి: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌, తన సరికొత్త ఓలా ఎస్‌1 ఎయిర్‌ను విడుదల చేయడం ద్వారా పెట్రోల్‌ వాహనాల యుగానికి ముగింపు పలికే దిశగా భారతదేశాన్ని మరింత చేరువ చేసే దిశగా నేడు భారీ ఎత్తున కృషి చేస్తోంది. ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా రూపుదిద్దుకున్న ఓలా తన ఎస్‌1 పోర్ట్‌ఫోలియోలో తాజా విస్తరణ భారతదేశ ఎలక్ట్రిక్‌ వాహనాల విప్లవాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోందని ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ తెలిపారు. తాము ఎలక్ట్రిక్‌ మొబిలిటీలోకి ప్రవేశించేందుకు ఒక నెల ముందు 4000 యూనిట్లతో ప్రారంభించి, ఎలక్ట్రిక్‌ వాహనాలు ఇప్పుడు స్కూటర్ల విభాగంలో 15%కు చేరుకున్నాయని, ఢల్లీి, బెంగళూరు మరియు పూణె తదితర నగరాల్లో కొత్త స్కూటర్‌ విక్రయాలలో 40% కన్నా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. భారతదేశంలో 2025 నాటికి అన్ని 2వీలర్లు ఎలక్ట్రిక్‌గా మార్చే లక్ష్యాన్ని కలిగివున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img