Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కంకటాల అవుట్‌లెట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : క్వీన్‌ ఆఫ్‌ శారీస్‌ అయిన కంకటాల శారీస్‌ హైదరాబాద్‌లోని కూకట్‌ పల్లిలో తన 11వ రిటైల్‌ అవుట్‌ లెట్‌ ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లలోని బాగా పాతతరం నాటి బ్రాండ్లలో కంకటాల ఒకటి. 77 ఏళ్లుగా అది పాతకాలం నాటి చేనేత టెక్నిక్‌లకు ప్రాతినిథ్యం వహిస్తోంది. మార్కెట్‌లో ట్రెండ్స్‌ కు ఈ బ్రాండ్‌ పేరొందింది. ఏళ్లుగా నిలకడగా వృద్ధి చెందుతోంది. కూకట్‌పల్లి అవుట్‌లెట్‌ హైదరాబాద్‌లో కంకటాల 2వ స్టోర్‌. కూకట్‌పల్లి, పరిసర ప్రాంత ప్రజల అవసరాలను ఇది తీర్చనుంది. సోమవారం ఉదయం 10.53 గంటలకు ఇది కంకటాల శారీస్‌ సీఎండీ మల్లిక్‌ కంకటాల, మూడో తరం డైరెక్టర్లు అరవింద్‌, భరత్‌, అనిరుద్‌ కంకటాలతో యావత్‌ కుటుంబసభ్యులు, ముఖ్యఅతిథి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో సంప్రదాయరీతిలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img