Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కళ్లద్దాలు, లెన్సెస్‌పై వైరస్‌కు ఇక తావులేదు

హైదరాబాద్‌ : పరిశుభ్రత మరియు వైరస్‌, బాక్టీరియాల నుంచి రక్షణ అనేవి గత కొన్ని నెలలుగా నిత్యజీవితంలో ఎంతో ముఖ్యమైనవిగా మారాయి. ఏళ్లుగా జెయిస్‌, జర్మ నీకి చెందిన ఫర్ట్‌ వాంగన్‌ యూనివర్సిటీ సంయుక్తంగా కళ్లద్దాల పరిశుభ్రతపై పరిశోధనలు చేస్తున్నాయి. ఆప్టికల్‌ నైపుణ్యానికి, ప్రిసిషియన్‌ ఐగ్లా స్‌ లెన్స్‌లకు పేరొందిన జెయిస్‌ విజన్‌ కేర్‌ ఇప్పుడు కళ్లద్దాల యాంటీ రిఫ్లెక్టివ్‌ కోటింగ్‌ ప్యాకేజ్‌లోకి కంటికి కనిపించని, ప్రభావశీల కమైన యాంటీమైక్రో బియల్‌ సిల్వర్‌ను చొప్పించగల ప్రక్రి యను అభివృద్ధి చేసింది. లెన్స్‌పై నుంచి వైరస్‌, బాక్టీరి యాలను ఈ ప్రిసిషియస్‌ మెటల్‌ (ఏజ్‌ప్లస్‌ అయాన్స్‌) ప్రభావపూ రితంగా డియాక్టివేట్‌ చేయగలుగుతుంది. ఐఎస్‌ఒ ప్రమాణాలతో సహా టెస్ట్‌ ప్రొసీజర్స్‌ ప్రకారం స్వతంత్ర, అక్రెడిటిడ్‌ బయటి సంస్థలు యాంటీమైక్రో బియల్‌ ఎఫికసీ టెస్టింగ్‌ ను నిర్వహించాయి. మొత్తం మీద కొత్త కోటింగ్‌ అనేది ఐగ్లాస్‌ లెన్సుల పరిశుభ్రతకు తోడ్పడుతుంది. తక్కువ రిఫ్లెక్షన్‌కు వీలు కల్పి స్తుంది. గీతలు పడకుండా నిరోధిస్తుంది. లెన్స్‌లను శుభ్రం చేసుకోవడం కూడా సులభమని జెయిస్‌ విజన్‌ కేర్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌ రోహన్‌ పౌల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img