Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కార్టూన్‌ నెట్‌వర్క్‌లో సూపర్‌ హీరో ఎకాన్స్‌ సిరీస్‌

ముంబై : వార్నర్‌ మీడియా కిడ్స్‌ చానల్‌ కార్టూన్‌ నెట్‌వర్క్‌ తన మొదటి స్థానిక, సైన్స్‌-ఫిక్షన్‌ సూపర్‌ హీరో సిజిఐ సిరీస్‌ ‘ఎకాన్స్‌ ఏక్‌సే బడ్‌కర్‌ స్నేక్‌’ను ప్రకటించింది. ఈ పవర్‌ ప్యాక్డ్‌ బ్లాక్‌బస్టర్‌ జూన్‌ 27న సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 11.30 గంలకు, రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది.
ఈ సరికొత్త యానిమేటెడ్‌ సిరీస్‌ 13 ఏళ్ల స్ట్రీట్‌ స్మార్ట్‌ వండర్‌కిడ్‌ ఎకాన్‌ను మన కళ్ల ముందు ఉంచుతుంది. ఆయన మరెవరో కాదు, ప్రపంచపు అత్యంత శక్తివంతమైన పాములు ‘ఒకే ఒక్కడు’గా ఎంచుకొని, వాటి నుంచి ‘నాగమణి’ని బహుమతిగా పొందినవాడు. భయం లేని ఆయన ధోరణి ఆయనకు ఈ అదృష్టాన్ని అందించింది. అసాధారణమైన పాము వంటి శక్తులతో, ఈ టెక్‌ సావీ యువకుడు ఇంద్రియాల జ్ఞానం కలిగి ఉంటాడు. మాయ చేసే శక్తి ఉంటుంది. ప్రపంచపు దుష్టశక్తుల నుంచి మానవాళిని సురక్షితంగా ఉంచగలిగే శక్తిసామర్థ్యాలను కలిగి ఉంటాడు. ఇవి మాత్రమే కాదుబీ యాంత్రిక పాములతో సరిపోలే ఆయన ట్రెండీ హైటెక్‌ సూపర్‌ పవర్‌ ఆయనకు దుష్టులను తెలివిగా ఓడిరచే అదనపు శక్తి సామర్థ్యాలను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img