కోల్కతా: నేత్ర ఆరోగ్య విభాగంలో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్థ కావడంతో పాటుగా జాన్సన్ అండ్ జాన్సన్ మెడ్టెక్లో భాగమైన జాన్సన్ అండ్ జాన్సన్ విజన్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తమ పాఠశాల ఆధారిత కంటి ఆరోగ్య కార్యక్రమం సైట్ ఫర్ కిడ్స్ కార్యక్రమం 20వ వార్షికోత్సవాన్ని వేడుక చేశాయి. జాన్సన్ అండ్ జాన్సన్ విజన్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్లు 2002లో ప్రారంభించిన సైట్ ఫర్ కిడ్స్ కార్యక్రమం ద్వారా అల్పాదాయ, తగిన రీతిలో సేవలను పొందని కమ్యూనిటీకి చెందిన చిన్నారులకు సమగ్రమైన కంటి ఆరోగ్య సేవలను అందించడం ద్వారా కంటి సంరక్షణ అందుకోవడంలో అంతరాలను పూరించడం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో 500 మందికి పైగా చిన్నారుల కోసం కంటి పరీక్షలను నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం లయన్స్ సఫారీ పార్క్, కలకత్తా గ్రేటర్ విద్యా మందిర్ స్కూల్లో జరిగాయి.