Friday, April 19, 2024
Friday, April 19, 2024

జపాన్‌ కంపెనీలో 51 శాతం వాటా ఎల్లెన్‌బరీ కైవసం

హైదరాబాద్‌ : జపాన్‌కు చెందిన ఇండస్ట్రీయల్‌ గ్యాసెస్‌ గ్రూప్‌ ఎయిర్‌ వాటర్‌ ఇన్‌కార్పోరేషన్‌ నుండి వెల్లడిరచని మొత్తంకు ఇంటిగ్రేటెడ్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ మెడికల్‌ గ్యాస్‌ కంపెనీ అయిన ఎల్లెన్‌బరీ ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ లిమిటెడ్‌ ప్రమోటర్లు కంపెనీలో 51% వాటాను తిరిగి పొందారు. బహుళజాతి కంపెనీల ఆధిపత్యంలో ఉన్నటువంటి ఎల్లెన్‌బరీ ఇండస్ట్రియల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌, ఇప్పుడు అతిపెద్ద 100% ఇండియన్‌ యాజమాన్యంలోని ఇండస్ట్రీయల్‌, మెడికల్‌ గ్యాస్‌ కంపెనీగా అవతరించింది. ప్రస్తుత కోవిడ్‌ 19 వలన, మెడికల్‌ ఆక్సిజన్‌ సామర్థ్యాలను మెరుగుపరుచుకునే విషయంలో మాత్రమే కాకుండా కేంద్రీకృత గ్యాస్‌ పైప్‌లైన్‌ సిస్టమ్‌లు, కోవిడ్‌ చికిత్సకు కీలకమైన హాస్పిటల్‌ పరికరాల పరిష్కారాలను కూడా అందించడంలో తాము తిరిగి త్వరగా పోటీలోకి రావడం జరిగింది’’ అని ఎల్లెన్‌బరీ ఇండస్ట్రియల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డ్కెరెక్టర్‌ వరుణ్‌ అగర్వాల్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img