Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

డెక్కన్‌ హెల్త్‌కేర్‌లో అంకురిట్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు

ముంబయి: సెబీ నియంత్రణలోని ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్‌ అంకురిట్‌ క్యాపిటల్‌, సుప్రసిద్ధ న్యూట్రాస్యూటికల్‌, కాస్మెస్యూటికల్‌ ఉత్పత్తుల కంపెనీ డెక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌లో 7.71% వాటాను సొంతం చేసుకుంది. ఈ కంపెనీకి 13.30 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్‌కూ 37.60 రూపాయల ధరతో తమ ప్రిఫరెన్షియల్‌ ఇష్యూలో భాగంగా డెక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ కేటాయించింది. ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మింటో పురుషోత్తం గుప్తా మాట్లాడుతూ తమ కంపెనీ వృద్ధిలో భారీ మదుపరులు సైతం ఆసక్తి చూపుతుండటం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తాలను మిల్లీనియల్స్‌ కోసం గేమిఫైడ్‌ హెల్త్‌, వెల్‌నెస్‌లో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం వినియోగించనున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img