Friday, April 19, 2024
Friday, April 19, 2024

తిరుమలలో తొలి శాఖను తెరిచిన హెచ్‌డీఎఫ్‌సీ

తిరుపతి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో తమ మొదటి శాఖ ను ప్రారంభించినట్లు వెల్లడిరచింది. ఈ శాఖలో నూతన తరపు బ్యాంకింగ్‌ ఉత్పత్తులు, సేవలను ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ను సందర్శించే భక్తులకు అందించనుంది. ఈ శాఖను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీనియర్‌ అధికారుల సమక్షంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఐడీఈఎస్‌ ఏ వీ ధర్మారెడ్డి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న ఆధ్యాత్మిక పట్టణం తిరుమల. ఈ నూతన శాఖ తెరువడం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ శాఖల సంఖ్య ఇప్పుడు తిరుపతి జిల్లాలో 12 కు చేరింది. ఈ బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 139 నగరాల్లో 262 శాఖలు ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ తరుణ్‌ చౌదరి చెప్పారు. తిరుమలో తమ మొదటి శాఖ పలు ప్రపంచ శ్రేణి బ్యాంకింగ్‌ ఉత్పత్తులు, సేవలను అందిస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img