Friday, April 19, 2024
Friday, April 19, 2024

తెలంగాణ నుంచి భారీగా పెరిగిన స్పైసెస్‌ ఎగుమతులు

ముంబయి: అంతర్జాతీయ ట్రేడ్‌ ఫైనాన్స్‌ కంపెనీ డ్రిప్‌ క్యాపిటల్‌ ఇంక్‌ ఇటీవలనే తమ తాజా కమోడిటీ విశ్లేషణ నివేదికను భారతదేశపు స్పైస్‌ ఎగుమతులపై విడుదల చేసింది. ప్రొప్రైయిటరీ, పబ్లిక్‌గా లభించే డాటా నుంచి పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ ధోరణులను అర్ధం చేసుకోవడం వరకూ ఈ నివేదికలో భారతదేశంలో లభ్యమయ్యే వివిధ స్పైసెస్‌ ఎగుమతులను గురించి చర్చించారు. అంతర్జాతీయంగా స్పైసెస్‌ ఎగుమతి పరంగా అతి పెద్ద దేశం ఇండియా. పశ్చిమ కనుమలతో పాటుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకలోని కొండ ప్రాంతాలలో దాదాపు భారతదేశంలోని 60% పసుపు ఉత్పత్తి చేస్తాయి. అయితే, పసుపు ఉత్పత్తి పరంగా అతి పెద్ద తోడ్పాటును తెలంగాణా అందిస్తూ 30% కమోడిటీకి తోడ్పాటునందిస్తున్నప్పటికీ, ఎగుమతుల పరంగా తెలంగాణా అతి అరుదుగా మాత్రమే తోడ్పాటునందిస్తుంది. ఈ ప్రాంతం నుంచి సైసెస్‌ ఎగుమతులు గత ఐదు సంవత్సరాలుగా అంటే 2021 ఆర్ధిక సంవత్సరం వరకూ 37% సీఏజీఆర్‌ వృద్ధిని నమోదు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img