Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నివా బుపా సరికొత్త బీమా ప్లాన్‌ విడుదల

హైదరాబాద్‌ : భారతదేశ అతిపెద్ద స్టాండ్‌ అలోన్‌ బీమా సంస్థల్లో ఒకటైన నివా బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (గతంలో మాక్స్‌ బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌) నూతనంగా ఒక విభిన్నమైన పర్సనల్‌ యాక్సిడెంట్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. పాలసీదారులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించి మరణం, పాక్షిక, తాత్కాలిక లేదా శాశ్వత అశక్తత చోటు చేసుకున్న సందర్భంలో ఇది వారికెంతగానో తోడ్పడుతుంది. ఎలాంటి భయం లేకుండా పాలసీదారులు ప్రశాంతంగా జీవించాలనే ఆశయంతో ఈ ప్లాన్‌ డిజైన్‌ చేయబడిరది. ‘లివిట్‌అప్‌’ క్యాంపెయిన్‌ తో ఆవిష్కరించబడిన ఈ ఉత్పాదన విశిష్ట ప్రయోజనాలను అందించాలనే భావనకు రూపం ఇచ్చేలా, పాలసీదారులు తమ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందించేందుకు ప్రోత్సహించేలా రూపుదిద్దుకుంది. ఈ పర్సనల్‌ యాక్సిడెంట్‌ ప్లాన్‌ వార్షికాదా యానికి 25 రెట్ల దాకా సమ్‌ఇన్సూర్డ్‌ను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img