Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నేడు ప్రపంచ స్ట్రోక్‌ డే

విశాలాంధ్ర/హైదరాబాద్‌: స్ట్రోక్‌ అనేది మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరాను అడ్డుకోవడం లేదా రక్తస్రావం జరగడం వలన ఏర్పడే ఒక తీవ్రమైన నరాల వ్యాధి, ఫలితంగా అది పక్షవాతానికి దారితీస్తుంది. గుండెపోటు, క్యాన్సర్‌ తర్వాత, ప్రపంచంలో మరణాలకు, వైకల్యాలకు ఇది మూడవ అతి పెద్ద ప్రధాన కారణమని అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరోసైన్సెస్‌ (హైదరాబాద్‌) న్యూరాలజీ యూనిట్‌ హెచ్‌ఒడి, ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ తెలిపారు. ప్రపంచ స్ట్రోక్‌ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఆరుగురిలో ఒకరు తమ జీవితకాలంలో స్ట్రోక్‌కు గురై ఉంటారని, 40 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి నలుగురిలో ఒకరిలో స్ట్రోక్‌ ప్రాబల్యం పెరగడానికి అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్‌ సహా తెలంగాణలో, కోవిడ్‌-19 మహమ్మారి తరువాత స్ట్రోక్‌ కేసులు పెరిగాయని తెలిపారు. దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి అత్యవసర చికిత్స అవసరమనే వాస్తవంపై అవగాహన పెరిగిందన్నారు. 5 సంవత్సరాల క్రితంతో పోలిస్తే, ఇప్పుడు స్ట్రోక్‌ థ్రోంబోలిసిస్‌ (క్లాట్‌ బస్టర్‌ థెరపీ), థ్రోంబెక్టమీ ప్రక్రియల (మెదడు ధమని నుండి గడ్డకట్టడాన్ని తొలగించడానికి జోక్యాలు)ను రెట్టింపు సంఖ్యలో చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img