Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పారాలింపిక్స్‌ విజేతలకు జాన్సన్‌ కంట్రోల్స్‌-హిటాచి స్పాన్సర్‌షిప్‌

హైదరాబాద్‌ : టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులకు జాన్సన్‌ కంట్రోల్స్‌-హిటాచి ఎయిర్‌ కండీషనింగ్‌ ఇండియా లిమిటెడ్‌ మద్దతుతో షిరిడీ సాయిబాబా ఫౌండేషన్‌ (ఎస్‌ఎస్‌ బిఎఫ్‌) ‘రేడియంట్‌ ఇన్‌ క్వెస్ట్‌ ఆఫ్‌ గోల్డ్‌’ ప్రాజెక్టు పేరుతో స్పాన్సర్‌షిప్‌ అందించింది. ఈ ప్రాజెక్టు 2017లో ప్రారంభమైంది. ‘రేడియంట్‌ ఇన్‌ క్వెస్ట్‌ ఆఫ్‌ గోల్డ్‌’ క్యాంపెయిన్‌ కింద జాన్సన్‌ కంట్రోల్స్‌-హిటాచి ఎయిర్‌ కండీషనింగ్‌ ఇండియా లిమిటెడ్‌ 10 మంది పారా అథ్లెట్స్‌ స్పాన్సర్‌షిప్‌ చేపట్టింది. ఈ సంస్థ లక్ష్యం టోక్యో పారా ఒలింపిక్స్‌ 2020లో పతకాలు సాధించడమే. ఈ సంస్థ స్పాన్సర్‌ చేసిన ఈ 10 మందిలో ముగ్గురు టోక్యో పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం ఈ కార్యక్రమం సాధించిన ఘన విజయానికి నిదర్శనం. టోక్యో పారాలింపిక్స్‌ 2020లో సుమిత్‌ అంటిల్‌ (స్వర్ణం), యోగేశ్‌ కథునియా (రజతం), సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ (కాం స్యం) పొందారు. ఈ కార్యక్రమం సాధించిన విజయం భారతదేశంలో పారా క్రీడల ప్రాచుర్యానికి నాంది పలికింది. ఈ క్యాంపెయిన్‌ కింద స్పాన్సర్‌ చేసిన 10 మంది పారా అథ్లెట్స్‌ గత 3 ఏళ్లలో ఏషియన్‌ పారా గేమ్స్‌, వరల్డ్‌ పారా గ్రాండ్‌ పిక్స్‌, టోక్యో పారా ఒలింపిక్స్‌ వంటి వివిధ అంతర్జాతీయ వేదికలపై 19 మెడల్స్‌ సాధించారు. ఇది దేశానికి గొప్ప విజయం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img