Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పెరిగిన బంగారం, వెండి ధరలు

న్యూదిల్లీ : బంగారం ధర క్రమంగా పుంజుకొంటోంది. దేశ రాజధాని దిల్లీలో మంగళవారం బంగారం ధర రూ.389లు పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.46,762కి చేరింది. క్రితం ట్రేడిరగ్‌లో ఈ ధర రూ.46,373గా ఉంది. వెండి కూడా కిలోకు రూ.397లు పెరగడంతో మొత్తం ధర రూ.69,105కి చేరింది. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1806 డాలర్లుగా ట్రేడవుతుండగా.. ఔన్సు వెండి ధర 26.63 డాలర్లుగా ఉంది. డాలర్‌ బలహీనపడటంతో పసిడి కొనుగోళ్లు పెరిగేందుకు దోహదపడినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ విశ్లేషకుడు (కమోడిటీస్‌) తపన్‌ పటేల్‌ పేర్కొన్నారు. కాగా హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.49,400లకు పైగా (అన్ని పన్నులతో కలిపి) ట్రేడ్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img