Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్‌ 32 వై1 స్మార్ట్‌ టీవీ

విశాలాంధ్ర/హైదరాబాద్‌: ట్రాన్సిన్‌ గ్రూప్‌ నుంచి ప్రీమియం బ్రాండ్‌ ఇన్ఫినిక్స్‌ 32వై1 స్మార్ట్‌ టీవీని ప్రారంభించామని ఇన్ఫినిక్స్‌ ఇండియా సీఈవో అనిష్‌ కపూర్‌ తెలిపారు. దేశంలోనే అత్యంత సరసమైన 32 అంగుళాల ఈ స్మార్ట్‌ టీవీ ధర కేవలం రూ. 8999 మాత్రమేనన్నారు. అపరిమిత కంటెంట్‌ వినియోగం కోసం అత్యుత్తమ చిత్ర నాణ్యత, నాణ్యత గల స్టీరియో సౌండ్‌, ఇతర ఫీచర్‌లతో పాటు ఈ సెగ్మెంట్‌లో అత్యధిక సంఖ్యలో అంతర్నిర్మిత ఓటీటీ యాప్‌లతో వస్తోందని పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌ టీవీ జూలై 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇందులో యూట్యూబ్‌, అమెజాన్‌ ప్రైమ్‌, సోనీ లైవ్‌, జీ5, ఈరోస్‌ నౌ, యుప్ప టీవీ, అజతక్‌, ప్లెక్స్‌, హాట్‌స్టార్‌ ఉన్నాయన్నారు. ఇతర స్పెసిఫికేషన్‌లలో డాల్బీ ఆడియో, మిరాకాస్ట్‌, వై-ఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ కనెక్టివిటీ మరెన్నో ఉన్న 20డబ్ల్యు స్పీకర్లు ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్‌లోలార్జ్‌అప్లయెన్సెస్‌ ఉపాధ్యక్షుడు హరి జి కుమార్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img