Friday, April 19, 2024
Friday, April 19, 2024

వంద శాతం ఉత్తీర్ణతను సాధించిన ఓక్రిడ్జ్‌

హైదరాబాద్‌ : ఎంతగానో ఎదురుచూసిన గ్రేడ్‌ 10, 12 ఫలితాలు ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, బాచుపల్లికి గర్వించదగ్గ క్షణాలుగా నిలిచాయి. మొత్తం విద్యా సంవత్సరాన్ని కరోనా మహమ్మారి తరంగాలు తుడిచిపెట్టినప్పటికీ, అధ్యాపకులు, విద్యార్దులు ఎంతో కలిసికట్టుగా గత స్కోర్‌లను సాధించారు. వారు ఆశించినట్లుగానే ఫలితాల ప్రకటన రావడంతో బాచుపల్లిలోని ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులకు అవకాశాలు వెల్లువెత్తాయి. బాచుపల్లి ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బల్జీత్‌ ఒబ్‌రాయ్‌ మాట్లాడుతూ, ‘‘లక్ష్యంతో ఉండండి’’ అనే మా నినాదంఉద్దేశ్యాన్ని, భావాన్ని ఫలితాలు నిరూపించాయన్నారు. పాఠశాల సగటు 84%తో 100శాతం ఉత్తీర్ణతను సాధించింది. ఎఐఎస్‌ఎస్‌సిఇ గ్రేడ్‌ 12 లో, కామర్స్‌ నుండి క్షితిజ్‌ నాయర్‌ 97%, బ్కెపిసి నుండి శ్రీ నిత్య 97%, ఎమ్‌పిసి నుండి శ్రీ హరిణి 96% ను సాధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img