Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వర్ధ్దమాన ఫోటోగ్రాఫర్‌లకు సత్కారం

హైదరాబాద్‌ : తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టిసిఇఐ) – ఈవెంట్‌ ఆర్గనైజర్‌, అసోసియేటెడ్‌ ప్రొఫెషనల్స్‌కు చెందిన సంయుక్త అసోసియేషన్‌, తెలంగాణ ఈవెంట్‌ ఫెసిలిటేటర్స్‌ అసోసియేషన్‌ – టిసిఇఐలో భాగంగా ఉన్న అసోసియేషన్‌లు అవర్‌ ప్యాలెస్‌లో ‘టిసిఇఐ – టెఫా వరల్డ్‌ ఫోటోగ్రఫీ డే’ను బుధవారం నిర్వహించాయి. ఈ సందర్భంగా తెలంగాణలోని వర్దమాన ఫోటోగ్రాఫర్‌లను సత్కరించారు. దీనిని తెలంగాణ ఫోటోగ్రఫీ అకాడమీ, కార్యదర్శి కొమ్మిడి విశ్వేందర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాఖీ కంకారియా, టిసిఇఐ, ప్రెసిడెంట్‌బీ తౌఫిక్‌ ఖాన్‌, జాయింట్‌ సెక్రటరీ, టిసిఇఐబీ మనోజ్‌ ఇన్నాని, ప్రెసిడెంట్‌, టిఇఎఫ్‌ఎబీ నీరూ మోహన్‌, సెక్రటరీ, టిఇఎఫ్‌ఎబీ పవన్‌ కుమార్‌ అగర్వాల్‌, ట్రెజరర్‌, టిఇఎఫ్‌ఎబీ సందీప్‌ జ్కెన్‌, ఫోటోగ్రఫీ కో-ఆర్డినేటర్‌, టిఇఎఫ్‌ఎబీ బాదం కృష్ణారావు, ఇసి మెంబర్‌, టిసిఇఐ మరియు రాంబాబు ధనిశెట్టి ఏస్‌ ఫోటోగ్రాఫర్‌ మరియు కెనాన్‌ ఇండియా ట్రైనర్‌లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img