Friday, April 19, 2024
Friday, April 19, 2024

విప్రో జీఈ వెర్సానా అల్ట్రాసౌండ్‌ ఉత్పత్తులు ప్రారంభం

హైదరాబాద్‌ : ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌కేర్‌, హెల్త్‌కేర్‌ ఉత్పత్తుల్ని సొంతంగా తయారు చేసుకోవాలన్న ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దూసుకుపోతున్న భారతదేశానికి మద్దతుగా నిలిచింది విప్రో జీఈ హెల్త్‌ కేర్‌. అందులో భాగంగా దేశంలో అల్ట్రాసౌండ్‌ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న విప్రో జీఈ ఇప్పుడు స్థానికంగా మరిన్ని వెర్సానా ఉత్పత్తుల్ని భారతదేశంలో తయారు చేసేందుకు సిద్ధమైంది. సప్లయర్‌ ఎకో సిస్టమ్‌ మరియు స్థానిక ఉత్పత్తుల తయారీని మరింత పెంపొందించాలనే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కంపెనీ ఉత్పత్తుల్లో భాగమైన వెర్సానా అల్ట్రాసౌండ్‌ ఉత్పత్తుల్ని అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన బెంగళూరులోని కడుగొడి ఉత్పత్తి కేంద్రంలో తయారు చేయనున్నట్లు విప్రో జీఈ హెల్త్‌ కేర్‌, సౌత్‌ ఆసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రవణ్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img