Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

వివో వి25 5జి ఫోన్‌ విడుదల

ముంబయి: గ్లోబల్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వివో తన వి25 5జిని లాంఛ్‌ చేయడం ద్వారా భారతదేశంలో తన వి25 సిరీస్‌ లైనప్‌ని విస్తరించింది. 50 మెగాపిక్సెల్‌ ఐ ఏఎఫ్‌ సెల్ఫీ కెమెరా, 64 మెగాపిక్సెల్‌ ఓఐఎస్‌ నైట్‌ కెమెరాతో అద్భుతమైన కెమెరా పనితీరును అందించేలా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూపొందించారు. ఇది మ్యాజికల్‌ కలర్‌ ఛేంజింగ్‌ ఫ్లోరైట్‌ ఏజీ బ్యాక్‌ ప్యానెల్‌ను కలిగి ఉంది. సరికొత్త వి25 5జీ ట్రెండ్‌ సెట్టింగ్‌ సెల్ఫీ, కెమెరా ఔత్సాహికుల కోసం, ఫంక్షనల్‌ ఇంకా సొగసైన డిజైన్‌, ప్రీమియం ఫోటోగ్రఫీ ఫీచర్లు, ఉత్తమ-ఇన్‌-క్లాస్‌ పనితీరును కోరుకునేవారి కోసం ఉద్దేశించింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ సర్ఫింగ్‌ బ్లూ, ఎలిగెంట్‌ బ్లాక్‌ అనే రెండు రంగుల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. వివో వి25 5జి ధర రూ.27,999 (8జీబీG128జీబీ), రూ.31,999 (12G256జీబీ)గా ఉంది. ఇది 2022 సెప్టెంబర్‌ 20 నుండి ఫ్లిప్‌కార్ట్‌, వివో ఇండియా ఇ-స్టోర్‌, అన్ని భాగస్వామ్య రిటైల్‌ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img