Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

శ్రీచక్రలో ఫుడ్‌-గ్రేడ్‌ ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ సదుపాయం

హైదరాబాద్‌ : సుప్రసిద్ధ ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌, వ్యర్థ నిర్వహణ కంపెనీ శ్రీ చక్ర పాలీప్లాస్ట్‌ (శ్రీ చక్ర) తమ ఆధునీకరించిన ఫెసిలిటీ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. భారతదేశంలో ఫుడ్‌ గ్రేడ్‌ నాణ్యత కలిగిన రీసైకిల్డ్‌ పాలిథ్లీన్‌ టెరిఫాథలెట్‌ (పెట్‌) పెలెట్స్‌ ఉత్పత్తి చేస్తున్న మొట్టమొదటి కర్మాగారం ఇది. ఈ కంపెనీ తమ నూతన పోలియోలెఫిన్స్‌ రీసైక్లింగ్‌ సదుపాయాన్ని సైతం ప్రారంభించామని వెల్లడిరచింది. ఇది డియోడరైజ్డ్‌ బాటిల్‌ టు బాటిల్‌ గ్రేడ్‌ నాణ్యత కలిగిన పోల్యోలెఫిన్‌ పెలెట్స్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ కంపెనీ 10 మిలియన్లకు పైగా యుస్‌ డాలర్లను తమ రీసైక్లింగ్‌ సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసం పెట్టుబడి పెట్టింది. ఇది అత్యధిక గ్రేడ్‌ రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ను భారతదేశంలోని వినియోగదారులతో పాటుగా యూరోప్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ లాంటి అంతర్జాతీయ మార్కెట్‌లకు సరఫరా చేయనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img