Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్కామ్‌ల నుంచి రక్షణకు వాట్సప్‌ సేఫ్టీ క్యాంపెయిన్‌

ముంబయి : ఆన్‌లైన్‌ భద్రత గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో, వాట్సాప్‌ ఇటీవలి మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ ‘వాట్సాప్‌తో సురక్షితంగా ఉండండి’ పేరిట వినియోగదారులకు వారి భద్రత, సురక్షతను నియంత్రించుకునేందుకు వినియోగదారులకు సాధికారత కల్పించే వాట్సాప్‌లోని ప్రొడక్ట్‌ ఫీచర్లు, సేఫ్టీ మెజర్లపై చర్యలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారుల భద్రత వాట్సప్‌కు మొదటి ప్రాధాన్యతగా ఉంది. కంపెనీ తన ప్రొడక్ట్‌ ఫీచర్లు మరియు పరికరాల గురించి అవగాహన కల్పిస్తూ, వినియోగదారులు ఆన్‌లైన్‌ స్కామ్‌లు మరియు మోసాల బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు సహాయపడుతుంది. స్కామర్‌లు నమ్మకంగా, పట్టుదలతో ఉన్నప్పటికీ, వినియోగదారులు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని చెపుతోంది. టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ని ఆన్‌ చేయడం, అనుమానాస్పద ఖాతాలను బ్లాక్‌ చేసి, రిపోర్టు చేయడం, గ్రూప్‌ ప్రైవసీ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం, వ్యక్తిగత వివరాలను ఎవరు చూడాలో నియంత్రించుందకు ప్రైవసీ సెట్టింగ్‌లు చేసుకోవడంతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు అని సూచిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img